• కారుమూరు మహేష్,గుంపిన రఘునాథ గుప్తా, అడ్డ గోవిందరాజులు,తమ్మన అమర్నాథ్,ఉప్పల జగన్నాధ
  • రాష్ట్ర మహాసభలకు ఎన్నికైన నాయకులకు వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం ఘనసన్మానం..
  • రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిమంది కమిటీ సభ్యులకు ఆర్యవైశ్య నాయకులకు వ్యాపార, వాణిజ్య సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు…

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(వడ్లపూడి) మే 3 :వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం కళ్యాణ మండపంలోములుకూరి వెంకట రమణ,కర్ణాటిమధుసూధన శెట్టి వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షతన విశాఖ జిల్లా నుంచి మహాసభలకు ప్రాతినిధ్యం వహించిన నాయకులకు ఘనంగా కళ్యాణమండపంలోకి పూర్ణకుంభంతో ఘనంగా ఆహ్వానం పలికారు.తదనంతరం నాయకుల చేత శ్రీ వాసవి మాత అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన,పుష్పాల సమర్పణ,అమ్మ వారి ఆశీస్సులు తీసుకుని ఆసీనులు అయినారు.

తదనంతరం వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం ఘనంగా సాలువాలతో,పుష్పగుత్యాలతో వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.100 సం||చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఇల్లూరి లక్ష్మయ్య విశాఖ జిల్లా నుంచి రాష్ట్ర కమిటీ లోకి ఐదుగురు సభ్యులను నియమించడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ స్టేట్ కోఆర్డినేటర్ గా కారుమూరు మహేష్ ని,స్టేట్ ఉపాధ్యక్షులుగా గుంపిన రఘునాథ గుప్తా,స్టేట్ కార్యదర్శిగా అడ్డ గోవిందరాజులు,ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గా తమ్మన అమర్నాథ్,స్టేట్ ఈసీ మెంబర్గా ఉప్పల జగన్నాధ రావు నియమించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య కి విశాఖ జిల్లా నాయకులు ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్ర నలుమూలన కూడా ఆర్యవైశ్య సంఘం నాయకులు,వాణిజ్య,వర్తక సంఘం నాయకులు సాలు వాళ్లతో పుష్పగుచ్చాలతో నాయకులకు ఘన సన్మానం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ స్టేట్ కోఆర్డినేటర్ గా కారుమూరు మహేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాసభలకు అధ్యక్షులు ఇల్లూరి లక్ష్మయ్య,మా గురువర్యులు టీజీ వెంకటేష్ సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కు రాష్ట్ర కమిటీ లో సభ్యులుగా నియామకం అందజేయటం.నాతో పాటు మరొక నలుగురు కమిటీ సభ్యులుగా నియమించటం నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది.మా గురువులకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు,కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.విశాఖ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు సభ్యులకు అలాగే వాట్లపూడి ఆర్యవైశ్య సంఘ సభ్యులకు ఎంత అదరాభిమానాలు కురిపించిన వర్తక,వాణిజ్య,వ్యాపార సంఘ సభ్యులందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.గాజువాక ఆర్యవైశ్య సంఘం అమ్మ వారి గుడి పక్కన గల 45 అడుగుల భారీ విగ్రహానికి పెయింటింగ్ నిమిత్తం అడ్డ గోవిందరాజులు సహకారంతో అమ్మవారి అలంకరణ కార్యక్రమం మొదలయిందని తెలిపారు. ఆర్యవైశ్యులు వాసవి మాత ముద్దుబిడ్డలైన ప్రజలకు ఎల్లవేళలా కూడా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా సహాయ సహకారాలతో సేవా దృక్పథంతో ఉంటారని తెలిపారు.స్టేట్ ఉపాధ్యక్షులుగా గుంపిన రఘునాథ గుప్తా: ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎంతటి అవకాశం అందించిన కారుమూరు మహేష్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి ఆర్యవైశ్య బిడ్డకు అండగా నిలుస్తానని నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.స్టేట్ కార్యదర్శిగా అడ్డ గోవిందరాజులు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీజీ వెంకటేష్,ఇల్లూరి లక్ష్మయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాంధ్ర టైగర్ ఆరు జిల్లాల నాయకులు కారుమూరు మహేష్ సారధ్యంలో ఎంతో సేవా దృక్పథంతో మరిన్ని కార్యక్రమాలు చేస్తానని ఆర్యవైశ్యులకు నా వంతు సేవా కార్యక్రమం తో పాటు ఆర్యవైశ్య బిడ్డలకు అండగా ఉంటానని తెలిపారు. ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గా తమ్మన అమర్నాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు రెండు కార్యక్రమాలు చేయాలని తలచాను.మొదటిది కార్పొరేటర్ సంస్థలకు దీటుగా చిరు వ్యాపారలకు అవగాహన సదస్సుతోపాటు,వ్యాపారం చేసుకునే మెలకువలను అవగాహన కల్పిస్తామని తెలిపారు. రెండవది ప్రస్తుత సమాజంలో మానవాళికి అవసరమైన రక్తదాతల దగ్గర నుంచి గ్రహించి విధంగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి మా వంతు సహాయంగా బ్లడ్ డేటింగ్ క్యాంపు నిర్వహిస్తామని తెలిపారు. దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించవలసినదిగా కారుమూరు మహేష్,ఆర్యవైశ్య బిడ్డలతో సహకారం అందించాలని తెలిపారు.స్టేట్ ఈసీ మెంబర్గా ఉప్పల జగన్నాధ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాకు ఈ పదవి అందించిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయ సంబంధించి ఆర్యవైశ్యులు ఎదగాలని ఉద్దేశం రాష్ట్రంలో ఇతర ఇతర పార్టీల తరపు నుంచి ఆర్యవైశ్య బిడ్డలు రాజకీయంగా ఎదగాలని నా ఉద్దేశం.ఆర్యవైశ్య పెట్ట లకు ఎటువంటి సమస్య వచ్చిన వారికి సంబంధించి సహాయ సహకారాలతో పాటు కుటుంబ సమస్యలలో కూడా పరిష్కార దిశగా కార్యాచరణ బుద్ధి ఆర్యవైశ్య పెద్దలకు అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం తో పాటు ఆర్యవైశ్య సభ్యులు,కమిటీ మెంబర్లు,గ్రామ,వార్డు సభ్యులకు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *