• ఉక్కు కర్మాగారం పరిరక్షణయే యువత ప్రధాన లక్ష్యం…
  • కాంట్రాక్ట్ కార్మికులను తొలగించటం దారుణం..
  • డేటా సెంటర్ వల్ల ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటాయి..
  • 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు..
  • ఎకరం భూమి99 పైసలకి ప్రైవేట్ సంస్థలకు దారా దత్తం..
  • అధాని,జిందాల్ వంటి శక్తుల నుంచి నగరాన్ని కాపాడుకోవాలి..
  • ప్రజల ఎంతసేపు సోషల్ మీడియాలో ఉండటం కాదు….
  • ప్రజల హక్కుల కోసం వీధుల్లోకి రావాలి అని పిలుపు ఏబి..

మన ధ్యాస విశాఖపట్నం(హోటల్ మేఘాలయ)మే2: విశాఖలో తెలుగు శక్తి ఆధ్వర్యంలో జరిగిన మేదో మదనంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం ప్రజల గుండెల్లో చిరస్మరణంగా ఉండాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని జిందాల్ కైవసం చేసుకోవాలని. విశాఖ భూములు,పోర్టులు ఆదాని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపణ.విశాఖ కర్మాగారంలో వేలాదిమంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న వైనం.అత్యంత అమానుషంగా యాజమాన్యం ఒత్తులతో వేలాదిమంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం అమానుషం.డేటా సెంటర్ వంటి వాటికి ప్రభుత్వ పరంగా తక్కువ రాయితీలు ఇస్తున్నప్పటికీ ఉద్యోగ అవకాశాలు తక్కువ. 32 మంది ప్రాణ త్యాగాల వలన ఏర్పాటు అయినా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం ప్రజల అందరి బాధ్యత. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం ఎకరం భూమిని 99 పైసలకు లీసుకివ్వడం ఎంతవరకు సమంజసం. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఆయన మాట్లాడుతూ… సుమారు రూ.10 వేల కోట్లు కేటాయిస్తే జంజావతి వంటి పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని అభిప్రాయపడ్డారు.ఏటా 15 శాతం ఆస్తి పన్ను పెంచుతూ మధ్యతరగతి ప్రజలపై భారం మోపడం సరికాదని అన్నారు.ప్రజలు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా తమ హక్కుల కోసం వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు.ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారం కోసం మేధావులు,ప్రజలు సమష్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *