బద్వేలు, మన ధ్యాస మే1:

బద్వేలు పట్టణం లోగల ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం కార్యాలయం నందు శుక్రవారం మహనీయుల ఆశయాల సాధన సమితి ఆధ్వర్యాన, ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం కోశాధికారి సి.గంగన్న అధ్యక్షతన 2570 వ బుద్దపూర్ణిమ(బుద్ద జయంతి)ఉత్సవ వేడుక కార్యక్రమం ఘనంగా జరిగినది.ముఖ్య అతిథులు గా గౌరవనీయులైన బద్వేలు పట్టణ మున్సిపల్ కమీషనర్ వి.వి నరసింహారెడ్డి హాజరై బుద్ద ప్రతిమకు పూలు వేసి దీపం వెలిగించి అందరికీ బుద్ద పూర్ణిమ మరియు మేడే కార్మికదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేలు పట్టణంలో మహనీయుల ఆశయాల సాధన సమితి ఆధ్వర్యాన మొట్టమొదటి సారి బుద్ద జయంతి జరపడం అభినందనీయం,దశావతారాల్లో ఒకరైన గౌతమ బుద్దుడు బోధించిన సమానత్వము, పంచశీల ప్రస్తుత ప్రజలందరూ తప్పక పాటించాలన్నారు. పట్టణ అభివృద్దికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. మహనీయుల ఆశయాల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ బుద్దుని బోధనలు ప్రపంచం లోని అనేక దేశాల్లోని ప్రజలు ఆచరించి శాంతియుతంగా జీవిస్తున్నారని, బద్వేలు పట్టణం లోని నాగులచెరువు సుందరీకరణలో భాగంగా చెరువు మధ్య లో బుద్ద విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని కమీషనర్ ని కోరారు.నానబాల వెంకటేశ్వర్లు,ఎస్.ఎ సత్తార్,కె.వి సుబ్బారావు బుద్ధుని బోధనలను వివరించారు.అంనంతరం మున్సిపల్ కమీషనర్ నరసింహారెడ్డి ,ఎ.ఆర్.యస్ రతన్ టాటా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి బద్వేలు గురుమూర్తి,ప్రభుత్వ పెన్షనర్ల సంఘం కోశాధికారి సి.గంగన్న,సలహాదారు యం.పిచ్చయ్య, పట్టణ అభివృద్ది సొసైటి అధ్యక్షులు నానబాల కటేశ్వర్లు,మహనీయుల ఆశయాల సాధన సమితి గౌరవాధ్యక్షులు కె.వి సుబ్బారావు యు, వెంకటరమణ యాదవ్,ఆవాజ్ కమిటి అధ్యక్షులు ఎస్.ఎ సత్తార్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ అన్వర్ బాష, మైనార్టీ నాయకులు షేక్ మాహీర్ బాష,సంఘసేవకులు పాలేటి శ్రీనివాసులు రెడ్డి,ప్రభలవీటి వెంకటరమణ, పడిగె వెంకటరమణ, ఇద్దరు పట్టణ పారిశుధ్య కార్మికులను మరియు బి.సి సంక్షేమ బాలుర వసతి గృహంలోని పదవతరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యున్నత 587మార్కులు సాధించిన పి.అభినయ్ జీ విద్యార్థికి,హాస్టల్ వెల్ఫేర్ అధికారి యన్. ప్రసాద్ గార్లకు దుశ్శాలువాలు,రతన్ టాటా మెమెంటోలతో ఘనంగా సన్మానించి,విద్యార్ఠి కి ప్రశంసా పత్రము 1600 రూపాయల నగదు బహుమతి అందచేయడమైనది.అందరికీ బద్దుని బోధనల పుస్తకాలను పంపిణీ చేయడమైనది.ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ అధికారి యం.రాజునాయక్, హాస్టల్ సిబ్బంది.ప్రభుత్వ పెన్షనర్లు,వివిధ ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *