చిత్తూరు, మన ధ్యాస, ఏప్రిల్20. రిపోర్టర్ కమల్ రెడ్డి

చిత్తూరులో గాంధీ విగ్రహం ఎదుట చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం బిజెపి పార్లమెంటులో మహిళా బిల్లును అడ్డంపెట్టుకుని డి లిమిటేషన్ బిల్లును జనగణన జరపకుండా కులగనన జరపకుండా ఆమోదింప చేయాలని కుటిల ప్రయత్నం చేసింది దానిని ఇండియా కూటమి పార్టీ తిప్పి కొట్టింది మహిళా బిల్లు 2023లోనే ఆమోదం పొందింది కానీ ఆ బిల్లుని ఇంప్లిమెంట్ చేయకుండా మహిళలకు రావలసిన హక్కులను వాయిదా వేస్తూ అలాగే మహిళలలో ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఆదివాసీలకు వాళ్ళ హక్కులను దూరం చేసింది ఇప్పుడు ఇండియా కూటమి నాయకులను అనవసరంగా దూషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తున్నారు దీనిని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది బిజెపి పార్టీకి అలాగే ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉంటే 2023 మహిళా బిల్లు మీదనే రిజర్వేషన్లు అమలు చేయాలని అలాగే ప్రధానమంత్రి హోం మంత్రి పదవులను కూడా మహిళలు కేటాయించాలని 2023 బిల్లు ప్రకారం రాబోయే 2029 పార్లమెంటు సీట్లలో మహిళలకి 33% సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డి రమేష్ బాబు చిత్తూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టిక్కి రాయల్ అలాగే కోఆర్డినేటర్లు పూతలపట్టు ప్రభాకర్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుల్లెట్ రవి ,వెంకటేష్, సెల్వం, మహిళా నాయకులు కుమారి, అంబికా, తేజ, శ్రీనివాసులు ఖాదర్బాషా, అక్బర్, సుమంత్, మరియు పలమనేరు పూతలపట్టు చిత్తూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *