తవణంపల్లి, ఏప్రిల్ 18 మన ద్యాస

నిరుపేద గ్రామీణ విద్యార్థిని విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యాభ్యాసాన్ని అందిస్తున్న తవణంపల్లి మండలం దిగువ మాఘం గ్రామంలోని అమరరాజా విద్యాలయం తన విద్యా ప్రస్థానంలో ఒక విశిష్ట మైలురాయిని చేరుకుంటూ, స్థాపనకు పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగాదశాబ్దిఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిత్తూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ తుషార్ డూడి మాట్లాడుతూ, “గల్లా రామచంద్ర నాయుడు అమర రాజా సంస్థలను స్థాపించి జిల్లా లో అనేకరకాల సేవల అందిస్తున్నారు, ఇందులో భాగంగా విద్యాసంస్థలు స్థాపించి నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విలువలతో కూడినవిద్యనుఅందిస్తున్నారు, కావున విద్యార్థులు కూడా ఈ అవకాశానికి చేసుకొని విద్యఅనేదివ్యక్తిత్వవికాసానికి మూలస్తంభం, కావున విద్యార్థులు క్రమశిక్షణ, నిబద్ధతతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు.అమర రాజా ఫౌండర్ చైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను విస్తరించడం ద్వారా సమాజ అభివృద్ధికి దోహదపడటం మా కట్టుబాటు” అని తెలిపారు.అమర రాజా అడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాలజీస్ మాజీ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈఓ) విజయానంద్ మాట్లాడుతూ, “అమరరాజా విద్యాలయం కేవలం విద్య బోధనకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించే సమగ్ర విద్యను అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలవిద్యనుఅందించడం మా లక్ష్యం” అని తెలిపారు.అమర ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డా. గౌరీనేని రమాదేవి మాట్లాడుతూ, “విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అకాడమిక్ విద్యతో పాటు సాంస్కృతిక, నైతిక విలువల పెంపకం అత్యంతఅవసరం.అమరరాజా విద్యాలయం ఆ దిశగా ఆదర్శంగా నిలుస్తోంది” అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచించాయి. పాటలు, నృత్యాలు, నాటికలు భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో రాజన్న ఫౌండేషన్ హెడ్ రాళ్లపల్లి సతీష్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఎన్. జయశ్రీ, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజలు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *