తవణంపల్లి, 16 ఏప్రిల్ మన ద్యాస చిత్తూరుజిల్లాపూతలపట్టు నియోజకవర్గంతవణంపల్లి మండలం, దిగువ మాఘం గ్రామంలోని అమరరాజా విద్యాలయం 2026 ఏప్రిల్ సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు ఫలితాల్లో విశేష ప్రతిభను కనబరిచి 100% ఉత్తీర్ణతను సాధించింది. ఈ ఫలితాలతో పాఠశాల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రథమస్థానాన్నిదక్కించుకుంది.విద్యార్థుల కృషి, పట్టుదలతో పాటు ఉపాధ్యాయుల అంకితభావం, పాఠశాల సమర్థవంతమైన విద్యా విధానం ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ ఫలితాలు అమరరాజా విద్యాలయం నాణ్యమైన విద్యకు నిదర్శనంగా నిలిచాయి. ప్రతిభావంతుల వివరాలు:

మొదటి స్థానం
ఎ. కీర్తన – 489/500రెండవ స్థానం:
ఎస్. శంభవి 475/500మూడవ స్థానం:
ఎన్. దీక్షిత 472/500నాలుగవ స్థానం:డి. మానస 470/500 (సమాన మార్కులు)ఐదవ స్థానం:
ఎస్. హర్షిత – 470/500ప్రత్యేక ప్రతిభ:తెలుగు విషయంలో 100కి 100 మార్కులు 11 మంది విద్యార్థులు సాధించి ప్రత్యేక ప్రతిభను కనబరిచారు.ఈ సందర్భంగా అమర రాజా వ్యవస్థాపక చైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు, రాజన్న ఫౌండేషన్ హెడ్ రాళ్లపల్లి సతీష్, ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జయశ్రీ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులనుఅభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విజయంపై హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *