మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ )మొహమ్మద్ నగర్:ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల ఇళ్ల కల సాకారం అవుతుందని డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తెలిపారు. మండలంలోని నర్వ గ్రామంలో లబ్ధిదారురాలు లక్ష్మి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును ఆయన రిబ్బన్ కట్ చేసి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులకు దశల వారీగా ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తోందని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సర్పంచ్ గుట్టం అనసూయ నర్సింలు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్ యాదవ్, సర్పంచులు గజ్జల జీవన్, నాయకులు ఆకాష్, అథిక్, ఇఫ్తేకార్, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.