మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం ఉపాధిహామీ పనులను గ్రామ సర్పంచ్ చంద్రకళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథ కాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని, ఎండతీవ్రత దృష్ట్యా ఉదయ మే పనులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉపాధి కూలీలకు అన్ని సౌకర్యాలను కల్పించడంజరిగిందని, పంట కాలువల పూడికతీత పను లను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాల్రాజు, వార్డుసభ్యులు, నాయకులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
