అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతు ఖాతాలో రూ. 6000లు జమ చేస్తున్న సీఎం చంద్రబాబు,ఇప్పటికే గత రెండు విడతల్లో రూ.6,309 కోట్లు జమ,మూడో విడతగా నేడు రూ.2,675.97 కోట్లు విడుదల,రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు లబ్ధి.ఇచ్చిన హామీ మేరకు రైతులకు 20 వేల పెట్టుబడి భరోసా,,పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ మూడవ విడత నిధుల విడుదలతో రైతన్న ముఖాలలో సంతోషం..

ఉదయగిరి మార్చి 13, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్నారు. శుక్రవారం పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ మూడవ విడత నిధుల విడుదల సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ రైతుల తరఫున ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో రైతులకు లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 20 వేలు ఆర్థిక సహాయం చేయడం కూటమి ప్రభుత్వానికే సాధ్యం అన్నారు. రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2675 కోట్లు జమ చేసి రైతు పక్షపాత ప్రభుత్వమని తెలియజేశారున్నారు.ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో 45 వేల మందికి 25 కోట్లును వారు బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ కావడం వల్ల వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన పెట్టుబడులను సమకూర్చుకునే అవకాశం కలిగిందని ఎమ్మెల్యే కాకర్ల పేర్కొన్నారు. రైతుల జీవితాల్లో సంతోషం, స్థిరత్వం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మూడవ విడత నిధుల విడుదలతో రైతులకు మరింత ఆర్థిక భరోసా లభిస్తుందని, రైతాంగం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *