40 ఏళ్ల కళ టిడిపి తోనే సాధ్యం అంటున్నా కలిగిరి టౌన్ యూత్ ప్రెసిడెంట్ చల్లా వెంకీ.

కలిగిరి,మార్చి 14,మన న్యూస్, ప్రతినిధి, నాగరాజు కె.

ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కాకర్ల సురేష్ సహకారంతో 40 ఏళ్ల కళ నెరవేరింది,అని కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు 40 ఏళ్లగా నిర్వీర్యంగా ఉన్న రోడ్లను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి టీడీపీ నాయకులు తెలియజేయగా వెంటనే స్పందించి రోడ్లు వేఇంచడం జరిగింది. గతం లో వర్షాలకు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మన శాసనసభ్యులు కాకర్ల సురేష్ సహకారంతో మన కలిగిరి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, కలిగిరి టౌన్ యూత్ ప్రెసిడెంట్ చల్లా వెంకీ, కలిగిరి ఎమ్మార్వో సెంటర్ నందు సిసి రోడ్లు వేయించడం జరిగింది. దీనికిగాను ప్రజలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కాకర్ల సురేష్ ని ఎమ్మెల్యే గా గెలిపించుకోవడం మా అదృష్టం అని ప్రజలు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలిగిరి టౌన్ 246 బూత్ ఇంచార్జ్ పుల్లా వెంకటేశ్వర్లు, 249 బూత్ ఇంచార్జ్ చల్లా శ్రీనివాసులు, 249 బూత్ కో ఇంచార్జ్ గుణపాటి రవీందర్ రెడ్డి, టిడిపి యూత్ నాయకులు షేక్ బాబావాలి, మూడ హజరత్ , చిట్టెటి హేమంత్ కుమార్, తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *