జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమ శంకుస్థాపనకు మంత్రి నారా లోకేష్ రాక.

తిరుపతి మార్చి 12, మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె.

నెల్లూరు జిల్లా, బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామంలో ఏర్పాటు చేయనున్న సాగర్ డిఫెన్స్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ని తిరుపతి విమానాశ్రయంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆత్మీయంగా కలసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు పరస్పరం అభివాదాలు మార్చుకొని జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా జువ్వలదిన్నె గ్రామంలో స్థాపించబోయే సాగర్ డిఫెన్స్ పరిశ్రమ ప్రాజెక్ట్ గురించి చర్చించారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రాంతీయ యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు నెల్లూరు జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.తిరుపతి విమానాశ్రయంలో జరిగిన ఈ స్వాగత కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు కూడా పాల్గొని మంత్రి నారా లోకేష్ కి హృదయపూర్వక స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *