బంగారు పాల్యం, మన ధ్యాస,మార్చి 9

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలంలో ఆదివారం సాయంత్రం ఎన్.పి జయప్రకాష్ నాయుడు,ఎన్. పి. ధరణి నాయుడు, ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.సమాజంలో సౌభ్రాతృత్వం,ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్,తగ్గువారిపల్లి ఉప సర్పంచ్ లోకనాధ్ నాయుడు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు మాధవనాయుడు,బీసీ రవి నాయుడు,కమల్ నాథ్ రెడ్డి, ఎన్. పి.రాధాకృష్ణ నాయుడు, సూరి నాయుడు,నజీర్, జాకీర్,సుదర్శన్ నాయుడు,టిడిపి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం సోదరులు మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *