కొండాపురం, మార్చి 09,మన న్యూస్,(నాగరాజు కె ).

ఆదివారం రాత్రి ,ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు.ముందుగా ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు ని, చెరుకూరి నవీన్ ని ముస్లిం సోదరులు సాదర స్వాగతం పలికారు.అనంతరం మసీదులో నవాజ్ చేసి… ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు చెరుకూరి నవీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు, ముస్లిం సోదర సోదరీమణులకు స్వయంగా ఇఫ్తార్ విందులో ఆయన వడ్డించారు.అనంతరం సోదర సోదరీమణులతో కలిసి ఇఫ్తార్ విందులో భోజనం చేశారు. ట్రస్ట్ చైర్మన్ వెంకటాద్రి నాయుడు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు అన్ని విధాలుగా ట్రస్ట్ అండగా ఉంటుందని తెలియజేశారు.ప్రతి ఏటా సంక్రాంతికి ముస్లిం సోదరులకు పిండి వంటలను పంపిణీ చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, షేక్ ఖాసీం, చాన్ భాషా, టీడీపీ నాయుకులు దేవినేని వెంకటసుబ్బయ్య, చెరుకూరు శేషయ్య, ఉంటా హాజరత్,చెరుకూరి వెంకయ్య, మేదరమెట్ల కొండపనాయుడు, మాజీ సర్పంచ్ గుంటూరి యోనా, చెరుకూరి సుబ్బారావు ట్రస్ట్ సభ్యులు అంబటి సురేష్, దేవినేని చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *