
11 రోజుల పాటు జరగనున్న దేవరమ్మ తల్లి సంబరాలు
మన ధ్యాస ప్రతినిథి కిర్లంపూడి:కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో వేంచేసియున్న ఎరికిరెడ్డి కుటుంబీకుల ఆడపడుచు శ్రీ శ్రీ శ్రీ దేవరమ్మ తల్లి అమ్మవారి ఆలయ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఎరికిరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో శుక్రవారం సుమారు 3000 మందికి పైగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా కమిటీ సభ్యులు అమ్మవారితో పాటు ఆలయాన్ని పచ్చి పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.11 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడంలో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాలను పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామ పుర వీధుల్లో ఊరేగించడంతో పాటు భజన కీర్తనలు,విశేష పూజలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు.ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామపెద్దలు,ప్రజలందరూ పాల్గొని అమ్మ వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎరికిరెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి మా ఇంటి ఇలవేల్పు అయిన దేవరమ్మ అమ్మవారి సంబరాలు చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలియచేసారు.కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా దేవరమ్మ అమ్మవారు ప్రసిద్ధికెక్కారని, కొలిచిన వారిని కంటికి రెప్పలా కాపాడే దేవరమ్మ అమ్మవారి సంబరాలు గ్రామ ప్రజల సహకారంతో మరింత ముందుకు తీసికెళుతున్నామని వివరించారు.ఈ మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలకి,ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేశారు.దేవరమ్మ అమ్మవారి కృపా కటాక్షాలతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.