చిత్తూరు ఫిబ్రవరి 8 మన ద్యాస
చిత్తూరులోని స్థానిక విజయం విద్యాసంస్థ నందు, చిత్తూరు బౌద్ధ దమ్మ సంఘం, ఆధ్వర్యంలో బౌద్ధం నేటి అవసరం… పై ఉపన్యాస కార్యక్రమం జరిగింది. చిత్తూరు స్థానిక విజయం విద్యా సంస్థ నందు బౌద్ధ దమ్మ సంఘం ఉపన్యాస కార్యక్రమాన్ని అధ్యక్షులు వీకే మోహన్ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ పాత్రికేయులు, కవి, ఇంద్రవెల్లి రమేష్, విశిష్ట అతిథిగా బిక్షు సద్దా రఖిత, అలాగే గౌరవ అతిథిగా కట్టమంచి బాలకృష్ణారెడ్డి, ఆత్మీయ అతిథి డాక్టర్ రామలక్ష్మి, ప్రత్యేక అతిధి నందనూరు భాస్కర్ రెడ్డి, సంఘ ప్రధాన కార్యదర్శి రంగాని సహదేవ నాయుడు, పాల్గొని ముందుగా ప్రార్థన గీతంతో ప్రారంభించడం జరిగింది. అనంతరం బౌద్ధం నేటి అవసరం… కార్యక్రమంపై బౌద్ధ ప్రచారకులు, కవి, సీనియర్ పాత్రికేయులు ఇంద్రవెల్లి రమేష్ మాట్లాడుతూ, బుద్ధుని యొక్క పంచశీల సూత్రాలు, చతురార్య సూత్రాలు తెలియజేస్తూ, నేటి ఒత్తిడి, అశాంతి, మరియు వినియోగదారుల సమాజంలో బౌద్ధం, అత్యంత అవసరం కరుణ, మైత్రి అహింస, వంటి సిద్ధాంతాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సంఘర్షణలను తగ్గించడంలో మరియు సమతుల్య జీవనానికి మార్గ నిర్దేశం చేస్తాయని, శాంతి, సమానత్వం, మరియు పర్యావరణ పరిరక్షణకు బౌద్ధ బోధనలు నేటి ప్రపంచానికి దిక్సూచిగా పనిచేస్తున్నాయని తెలిపారు. సమ సమాజ నిర్మాణానికి బౌద్ధం ఎంతో అవసరం ఉందని కొనియాడారు. అనంతరం భిక్షు సద్దా రహిత మాట్లాడుతూ, మానవుడు స్వార్థాన్ని వీడి కోరికలను అదుపులో ఉంచుకొని శాంతియుతమైన జీవనం గడపడానికి నేటి సమాజానికి, బౌద్ధం అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అనంతరం కట్టమంచి బాలకృష్ణారెడ్డి, డాక్టర్ రామలక్ష్మి, భాస్కర్ రెడ్డి, పలువురు వక్తలు మాట్లాడుతూ, సమతుల్య జీవనంలో మితిమీరిన కోరికలు, వినియోగదారుల ధోరణికి, భిన్నంగా సమయమనంతో కూడిన మధ్య మార్గం, సుఖసంతోషాలను ఇస్తుందని బౌద్ధం బోధిస్తుందని, తెలిపారు. సాంఘిక సమానత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించినట్లుగా బౌద్ధం కుల వివక్షకు, వ్యతిరేకంగా సమానత్వం, స్వేచ్ఛ, మరియు సౌబ్రాతృత్వాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. అనంతరం అతిథులను దుస్సాలవతో సత్కరించి జ్ఞాపిక, బుద్ధుని ప్రతిమ, చందనమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది, ఈ కార్యక్రమానికి హాజరైన సభ్యులను క్రమసంఖ్య ఆధారంగా లక్కీ డిప్ తో, ఎంపిక చేసి ఏడు మందిని బుద్ధుని ప్రతిమతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి ఎం.ఆర్ అరుణకుమారి, బుద్ధ సోమరాజు, విశ్రాంత జడ్జి గుర్రప్ప,గిరిధరన్, కలకట రెడ్డప్ప, చంద్రశేఖర్, శ్రీ రంజని, లత, ప్రముఖ అమెరికా డాక్టర్ కట్టమంచి ఉమాపతి రెడ్డి, హైదరాబాదు నుండి విచ్చేసిన ప్రముఖులు సరోజినీ దేవి, వరలక్ష్మి, మిట్ట మహేంద్ర, కట్టమంచి కృష్ణవేణి, మాలతి, త్యాగరాజు నాయుడు,జగదీష్ కుమార్, శంకర అప్పాజీ పాడి రమేష్ బాబు, రాధ, నిజ లింగప్ప, నిర్మల, రామాంజనేయులు, అనంతకుమార్, ఢిల్లి కుమారి, మునస్వామి రెడ్డి, కుమారి, జగదీష్ కుమార్ రెడ్డి, శ్రీరాములు, కన్నయ్య, నాగరాజు,మురళి, రచయితలు ప్రముఖులు పాల్గొన్నారు.