దుత్తలూరు,కావలి, మన న్యూస్, పిబ్రవరి 08,(నాగరాజు కె ).
కొత్తసత్రం సముద్ర తీరంలో శ్రీ వెంగమాంబ తల్లి సముద్ర స్నానం (జలది స్నానం) కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు తల్లి విగ్రహానికి సముద్ర జలాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తల్లి దర్శనంతో భక్తి పరవశులయ్యారు.ఈ పవిత్ర కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తల్లి దివ్య దర్శనంతో పాటు జలది స్నానాన్ని వీక్షించి భక్తి పరవశులయ్యారు. కార్యక్రమం సందర్భంగా సముద్ర తీర ప్రాంతం భక్తుల నినాదాలు, వేద ఘోషలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.శ్రీ వెంగమాంబ తల్లి జలది స్నానం కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో భక్తులు ఆనందోత్సాహాలతో తిరిగి వెళ్లారు.
