
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం హెల్పింగ్ యూత్ ఆధ్వర్యంలో గాంధీ 78 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. రాజస్థాన్ స్వీట్ షాప్ రామ్ లాల్ ఆర్థిక సహాయంతో స్థానిక ఎంఈఓ ఆఫీస్ వద్దగల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది, తదుపరి ప్రభుత్వ ఆసుపత్రిలో గల గర్భిణీ స్త్రీలకు బేబీ బెడ్స్, రోగులకు పండ్లు రొట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ బ్రిటీషు పాలనలో వున్న భారత ప్రజలకు విముక్తి కలిగించడానికి మహాత్మ గాంధీ అహింసాయుతంగా పోరాడి భారత దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహాత్మ గాంధీ ని స్మరించుకోవడం ప్రజలందరి భాధ్యత అన్నారు.ఎంతో మంది మహనీయులు స్వాతంత్య్రం కొరకు ప్రాణత్యాగాల ఫలితం మహాత్మా గాంధీ నాయకత్వం లో భారత దేశానికి స్వాతంత్య్రం సిద్దించిందని వారందరినీ స్మరించుకోవలసిన బాధ్యత భారత ప్రజలందరిదీ అని అన్నారు.ఈ కార్యక్రమంలో ముద్దుల స్వరూప్, ఎస్.కె అలీషా,బండి కోటి,పర్వత శివ,తదితరులు పాల్గొన్నారు.