
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: కమ్యూనిస్టు పార్టీ ప్రజలందరికీ ఉపాధి హామీ ఉండాలని అప్పటి యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా పోరాడి 2005లో తీసుకొచ్చిన ఉపాది హమీ చట్టాన్ని మార్పులు చేయడం నిరసిస్తూ ఏలేశ్వరంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు మాట్లాడుతూ కాంట్రాక్టర్ల ఒత్తిడి మేరకు ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని భారత్ – జి రామ్ జి బిల్లుగా మార్పు చేస్తుందన్నారు. బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయింపు క్రమేపి తగ్గిస్తున్నారని ఈ బడ్జెట్ లో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పథకం కింద పని దినాలు 100 రోజుల నుండి 200 రోజులకు పెంచాలని, రోజువారి వేతనం 600 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పిల్ల రాంబాబు, పెదపాటి గురవయ్యమ్మ, గోక సత్యవతి, సీలి లక్ష్మి, పూసపాటి దయామని, మిరియాల వెంకటలక్ష్మి దోనేపూడి లక్ష్మి మహిళలు ఉన్నారు.