మన ధ్యాస, నెల్లూరు రూరల్, జనవరి 19 : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాదరాజుగూడూరు గ్రామంలో సోమవారం 36లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విలేజ్ హెల్త్ క్లినిక్ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, గుండ్లపాలెం పి.ఎ.సి.ఎస్. సొసైటీ చైర్మన్ పముజుల ప్రదీప్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో శానసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వందలకోట్ల రూపాయల నిధులతో అభివృద్ధిపనులు జరుగుతున్నాయి అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నా రు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ మండలంలో 116 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నా రు. మాటకు కట్టుబడివుండే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా, అండగా ఉంటాం అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అభివృద్ధి, సంక్షేమం రెండూ రెండు కళ్ళలా భావించి పనిచేస్తున్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో ఎన్నడూ లేని విధంగా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి సారధ్యంలో అభివృద్ధి జరుగుతుంది అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ అల్లాబక్షు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇంచార్జ్ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పల్లంరెడ్డి రవీంద్ర రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ సారంగం గున్నయ్య, గ్రామ సర్పంచ్ సి.హెచ్. వెంకటేశ్వర్లు యాదవ్, మాదరాజుగూడూరు పి.ఎ.సి.యస్. సొసైటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, వార్డ్ మెంబర్ నవీన్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పందిపాటి రాము, టిడిపి నాయకులు ఉప్పు కృష్ణ, బెల్లంకొండ విజయ్ కుమార్, నెట్రంబాక రాజేంద్రప్రసాద్, పంబడి సురేంద్ర, లేబూరు అశోక్, తాండ్ర వెంకటేశ్వర్లు, వెంకట కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, పి.సుందర్, బుజ్జయ్య, పి.శ్రీను, టి. రమణయ్య, మారిపాటి శ్రీను, శీను, లేబూరు గణేష్, రవి, శివ, శేఖర్, మహేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

