మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన రెండో విడత సీఎం కప్–2025 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కాగడ ర్యాలీ (టార్చ్ ర్యాలీ) ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కాగడ ర్యాలీని ఉత్సాహంగా ముందుండి నడిపించారు. యువతలో క్రీడాస్ఫూర్తి, ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే సీఎం కప్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,బంజపల్లి గ్రామ సర్పంచ్ ఏలే సుగుణమ్మ , ఎంపీడీవో శివకృష్ణ,తహసీల్దార్ భుజంగరావు, ఆర్ఐ సాయిలు,ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, పంచాయతీ కార్యదర్శులు భీమ్రావు, రవికుమార్ రాథోడ్,మతిన్,నాయకులు అనిస్,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *