మన ధ్యాస,నిజాంసాగర్: ( జుక్కల్ ) ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిజాంసాగర్ నది పరివాహక ప్రాంతమైన నాగ మడుగులో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఈ సందర్భంగా నది ఒడ్డున గల శివలింగానికి రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. దీని పక్కన గల నాగ స్వరూపానికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎవరికైనా కాల సర్ప దోషాలు ఉన్నట్లయితే స్నానం ఆచరించి ఈ పూజలు నిర్వహించుకుంటారు.దీని ద్వారా ఉద్యోగాలు,సంతానం, వివాహముకు ఆటంకాలు ఉన్న తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ యొక్క పుణ్యస్నానాలకు మహారాష్ట్ర,కర్ణాటక,జహీరాబాద్, నారాయణఖేడ్,ఆంధ్ర ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు. అచ్చంపేట్
పురోహితులు సంజువు శర్మ పూజలు నిర్వహిస్తారు.ఈ నీటిలో ఔషధ తత్వాలు ఉంటాయని దాని ద్వారా చర్మ రోగులు గాని ఇంకా ఏదైనా వ్యాధులు ఉన్న తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ కార్యక్రమాన్ని అచ్చంపేట్ గ్రామస్థులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అందరూ ఈ భోజనాన్ని మహా ప్రసాదంగా స్వీకరిస్తారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంకు లక్ష్మయ్య, ఉప సర్పంచ్ రవీందర్,చాకలి రమేష్ కుమార్,మ్యాదరి సాయిలు,సంకు ప్రసాద్, మంగలి ఎల్లయ్య,అంజయ్య, పాల్గొన్నారు.
