సర్వేపల్లి నియోజకవర్గ రూ 358 కోట్లతో అభివృద్ధి……… సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మన ధ్యాస, మనబోలు,జనవరి 12 : నెల్లూరు జిల్లా,మనుబోలు మండలం పిడూరు, కాగితాలపూరులో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ…….పిడూరులో రూ.1.50 కోట్లతో, కాగితాలపూరులో రూ.3.80 పూర్తి చేసిన త్రీఫేజ్ విద్యుత్ లైన్ల వ్యవస్థలకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది అని అన్నారు.కాగితాలపూరులో రూ. 32 లక్షలతో పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అని అన్నారు.18 నెలల పాలనలో రూ.358 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం అని అన్నారు.పల్లెల్లో పంచాయతీ కార్యాలయాలతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలు మొదలయ్యాయి అని అన్నారు.ప్రతి ఊరిలో సిమెంట్ రోడ్లను నిర్మించడంతో పాటు తాగునీటి పథకాలను అందుబాటులోకి తెస్తున్నాం అని అన్నారు.పారదర్శకంగా జరుగుతున్న పనులతో ఇరిగేషన్ వ్యవస్థ పూర్వవైభవం సంతరించుకుంటోంది అని అన్నారు.ఆర్డీఎస్ఎస్ లో భాగంగా విద్యుత్ లైన్ల ఆధునికీకరణను ప్రభుత్వం చేపట్టింది అని అన్నారు.సింగిల్ ఫేస్ విద్యుత్ లైన్లను త్రీఫేస్ గా మారుస్తున్నారు అని అన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.105 కోట్లతో పనులు సాగుతుండగా, జిల్లా వ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు అని అన్నారు.70 శాతం కేంద్ర నిధులు, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిథులతో ఈ పనులు చేపట్టారు అని అన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో 58 ఫీడర్లకు గాను 6 ఫీడర్లలోనూ త్రీఫేజ్ లైన్ల ఏర్పాటు పూర్తి చేయడం పూర్తయింది అని అన్నారు.28 ఫీడర్లలో ఇప్పటి వరకు పనులే ప్రారంభించకపోవడం సరికాదు అని అన్నారు.పనులు ప్రారంభించి, పెండింగ్ లో ఉన్న ఫీడర్ల సంఖ్య 20కి పైగా ఉంది అని అన్నారు.ఎక్కువ పరిశ్రమలు ఉండటంతో పాటు ఆక్వా సాగు జరిగే ప్రాంతమైన సర్వేపల్లిలో ఈ పనులు మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది అని అన్నారు.అన్ని ఫీడర్ల పరిధిలో పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ తో పాటు అధికారులదే అని అన్నారు.పిడూరు, యాచవరానికి సంబంధించి రూ.1.60 కోట్లతో, కాగితాలపూరు పరిధిలో రూ.3.80 కోట్లతో పనులు పూర్తి చేశారు..ఇక ఈ గ్రామాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుంది అని అన్నారు.వ్యవసాయ విద్యుత్ 9 గంటల పాటు సరఫరా అయినా, గ్రామాల్లోని ఇళ్లకు మాత్రం నిరంతర సరఫరా ఉండబోతోంది అని అన్నారు.విద్యుత్ కోతలతో పాటు లోఓల్టేజీ సమస్యకు కూడా పరిష్కారమవుతుంది అని తెలియజేశారు.





