మన ధ్యాస, నెల్లూరు, జనవరి 10 :నెల్లూరును అభివృద్ధి పథంలో నడిపిస్తానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా 42వ డివిజన్ కోటమిట్టలోని అమీన్ నగర్ పార్క్, 46వ డివిజన్ పణతుల వారి వీధిలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ను ఘనంగా ప్రారంభించారు. డివిజన్ కు విచ్చేసిన మంత్రి నారాయణ కు స్థానిక టిడిపి నాయకులు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు.గత ప్రభుత్వ నిర్వాకంతో పార్కులు ,మంచినీటి పథకాలు నిర్వీర్యం అయ్యాయని..స్థానికుల కోరిక మేరకు అమీన్ నగర్ పార్కును ఆధునీకరించి ప్రారంభించమన్నారు.పిల్లల సంతోషం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని..47 పార్కుల్లో 40 పార్క్ లను ప్రారంభించామన్నారు. మరో ఏడు పార్కులను నెలాఖరు కల్లా పూర్తి చేస్తామన్నారు..ఈ ప్రాంతానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలని సంకల్పించామని..అజీజ్ ,ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తో మాట్లాడి స్కూల్ కి శంకుస్థాపన కూడా చేసామన్నారు. డిజైన్ లను మా పాప షరణి సిద్ధం చేసిందని..20 కోట్ల సీఎస్అర్ నిధులతో స్కూల్ నిర్మాణానికి రాజ్యసభసభ్యులు సీఎం రమేష్ ముందుకొచ్చారన్నారు..సిటీ లోని 14 స్కూల్స్ ని విఆర్సీ తరహాలో సిద్ధం చేసేందుకు దాతలు ముందుకొచ్చారని.వాళ్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఓపిక పడితే అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. నెల్లూరును ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు ప్రణాళికతో ముందుకెళుతున్నామన్నారు.ఆధునీకరణ పనులకు కాలువల ఆక్రమణదారులు సహకరించాలని నెల్లూరు ను దోమలు లేని నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.గతప్రభుత్వం మంచినీటి పథకాలను నిర్వీర్యం చేసిందని..కార్పొరేషన్ పరిధిలో రోజుకి ఆరులక్షల లీటర్ల మినరల్ వాటర్ సరఫరా చేసేందుకు ఎన్టీఆర్ సుజల సురక్ష పధకాన్ని 2014 లో ప్రారంభించామమన్నారు.రెండున్నర కోటితో పనులు కూడా చేసామని..మా పై కోపంతో ఆ పధకాన్ని గత పాలకులు అటకెక్కించారన్నారు.. తిరిగి వాటర్ ప్లాంట్ల పనులు ప్రారంభించామని..నాలుగున్నరకోటి సీఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చిందన్నారు..సగం నిధులు కూడా ఇచ్చేసారని..3 మదర్ ప్లాంట్ ల పరిధిలో 60 మినీ ప్లాంట్స్ ప్రారంభించామన్నారు..30 వాటర్ ప్లాంట్లను ఇప్పటికే పూర్తి చేసామనన్నారు..రెండు నెలల్లో మరో 30 ప్లాంట్లు పూర్తి చేస్తామన్నారు..రెండు రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని అందిస్తామన్నారు.. సిటీ లో రోజుకి 3 లక్షల లీటర్ల మినరల్ వాటర్ సరఫరా చేయటమే లక్ష్యంమన్నారు..ప్రతీ ఇంటికీ మంచినీటి కొళాయి కనెక్షన్ ఇస్తామన్నారు..ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ ,రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపక అనురాధ, 42వ డివిజన్ కార్పొరేటర్ కరిముల్లా, అధ్యక్షుడు ఖలీల్,క్లస్టర్ ఇంచార్జ్ జాఫర్ షరీఫ్, కో క్లస్టర్ మైనుద్దీన్, ప్రధాన కార్యదర్శి కాలేషా,స్థానిక టీడీపీ నేతలు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *