మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సంక్రాంతి పండుగను ముగ్గుల , పతంగుల, మరియు హరిదాసుల వేషధారణలు, గంగిరెద్దుల వేషధారణలు, రైతు కుటుంబం వేషధారణ లో విద్యార్థులు అలరించారు. రంగురంగుల రంగులతో విద్యార్థినులు రంగ వల్లులను తీర్చిదిద్దిన విధానం అబ్బురపరిచింది. మరియు విద్యార్థులు గాలిపటాలను ఆకాశంలో ఎగురవేస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదే విధంగా హరిదాసుల వేషధారణ,గంగిరెద్దుల వేషధారణ, రైతు కుటుంబం వేషధారణలో విద్యార్థులు అద్భుతమైన కళా ప్రదర్శనను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి బోదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, కౌన్సిలర్లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ చంద్ర శారద దేవి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. పాఠశాలలో గ్రామీణ వాతావరణాన్ని ఏర్పాటు చేసి సంక్రాంతి పండుగను భోగి మంటల ద్వారా ఎలా జరుపుకుంటారు విద్యార్థిని చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో,ఎండగుంది నాగబాబు, ఫ్రెండ్రా శీను, మామిడి లలిత, కర్రోతు గాంధీ,శశి స్వా,మీ
ఎన్డీఏ కోటమి సభ్యులు,ఉపాధ్యాయునీలు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *