తిరుపతి మన ద్యాస జనవరి 07 :- నేలపట్టు మరియు పులికాట్ సరస్సు తీరాన అత్యంత వైభవంగా నిర్వహించే ‘ఫ్లెమింగో ఫెస్టివల్ – 2026’ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. బుధవారం బి.వి.పాలెం పర్యాటక ప్రాంతంలో పర్యాటకుల కోసం సిద్ధం చేసిన బోటింగ్ సౌకర్యాలు మరియు ఇతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యాటకుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం:-పండుగ సందర్భంగా వేలాదిగా తరలివచ్చే పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బోటింగ్ నిర్వహణలో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, లైఫ్ జాకెట్లు మరియు శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అనంతరం పండుగ విశేషాలతో కూడిన టూరిజం శాఖ బ్రోచర్‌ను వారు ఆవిష్కరించారు.ఈ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్సీ పాల్గొని భద్రత మరియు పరిపాలనా పరమైన అంశాలపై చర్చించారు. వేంకటగిరి డి.ఎఫ్.ఓ శ్రీకాంత్, శ్రీకాళహస్తి మరియు సూళ్లూరుపేట ఆర్.డి.ఓలు భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, టూరిజం ఆర్.డి రమణ ప్రసాద్, సంక్షేమ శాఖ అధికారి కుమార్ రెడ్డి తదితరులు పర్యాటక వసతుల గురించి వివరించారు. విదేశీ విహంగాల రాకతో సందడిగా మారిన ఈ ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు ఈ పండుగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
