రేణిగుంట మన ధ్యాస జనవరి 7.
రేణిగుంట మండలం, తూకివాకం గ్రామానికి చెందిన గ్రామ రెవెన్యూ అధికారి తోటి చంద్రమోహన్ అకాల మరణం పట్ల ఏపీ గ్రామ రెవెన్యూ అసోసియేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది. ఆయన మృతి రెవెన్యూ విభాగానికి మరియు వారి కుటుంబానికి తీరని లోటు.అసోసియేషన్ తరపున తోటి చంద్రమోహన్ కి నివాళులు అర్పించారు.​తూకివాకం నివాసి, మన తోటి ఉద్యోగి అయిన చంద్రమోహన్ మరణవార్త మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిబద్ధత కలిగిన అధికారిగా ఆయన అందించిన సేవలు మరువలేనివి.వారి కుటుంబ సభ్యులకు మా అసోసియేషన్ తరపున, వ్యక్తిగతంగా నా తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.​ ఈ కష్టకాలంలో చంద్రమోహన్ కుటుంబం అధైర్యపడకూడదని, ఏపీ గ్రామ రెవెన్యూ అసోసియేషన్ వారికి ఎల్లవేళలా అండగా, తోడుగా ఉంటుందని హామీ ఇస్తున్నాము. వారికి అందాల్సిన ప్రయోజనాలు మరియు ఇతర సహాయక చర్యల విషయంలో అసోసియేషన్ పూర్తి బాధ్యతతో కృషి చేస్తుంది.
​వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *