మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:తూర్పుగోదావరిజిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పాలంకి నాగరాజు (ఎఫ్ ఏ సి)ఈ రోజు ఏలేశ్వరం నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ వారిని కలిసి మన జిల్లా గ్రంథాలయ సంస్థ కు చెల్లించ వలసిన బకాయిలు చెల్లించ వలసినది గా కోరుట జరిగింది సుమారు 50,00000/- వరకు బకాయిలు ఉన్నాయని వివరించారు.బకాయలలో కనీసం 2500000/-చెల్లించ వలసినది గా కోరియున్నారు సిబ్బంది జీతాలకు ఇబ్బంది ఉన్నందున త్వరితగతిన సెస్ బకాయిలు చెల్లించ వలసినది గా కోరియున్నారు. ఈ సమస్యపై కమీషనర్ సానుకూలంగా స్పందించి, సిబ్బందితో చర్చించి సెస్ బకాయిలు చెల్లిస్తాము అని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి తో ఏలేశ్వరం గ్రంథపాలకుడు కవికొండల సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *