తవణంపల్లి/ జనవరి 2 మన ద్యాస

తవణంపల్లి- అరగొండ మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది.పోలీసు వారి వివరాల ప్రకారం రోడ్డు ప్రమాదములో మరణించిన వ్యక్తి వివరాలు.వంక రాజు సురేష్ కుమార్ వయసు(21) సంవత్సరాలు, తండ్రి వంకరాజు సుధాకర్ ఎల్లవపల్లె విలేజ్, పోరుమామిళ్ల మండలం, కడప జిల్లా., అతను చిత్తూరులోని ఎస్ వి సెట్ కాలేజీలో చదువుతున్నాడు. అతను 02-01-2026 వ తేదీ సుమారు ఉదయం 12.40 మరియు ఉదయం 06.40 ల మధ్య సమయం లో పల్సర్ మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్.నెం. ఎ పి 04 బీవీ 5466 ను చిత్తూరుజిల్లా,తవణంపల్లె మండలము, చిత్తూరు-అరగొండ రోడ్డు లో వినాయక స్కూల్ సమీపమున నిర్లక్ష్యంగా మరియు వేగంగా నడుపుతూ, వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చిన్న దుకాణాన్ని ఢీకొట్టాడు.,దీని ఫలితంగా అతనికి ముక్కు, చెవులకు తీవ్ర రక్తస్రావ గాయాలు మరియు కుడి కాలికి బలమైన గాయాలయ్యాయి,
ఆ గాయాల కారణంగా అక్కడికక్కడే మరణించాడు. వంకరాజు సురేష్ కుమార్ వాళ్ళ నాన్న సుధాకర్ ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్సై డాక్టర్ నాయక్ తవణంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడమైనది, ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *