మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 31 :నెల్లూరు రాంజీ నగర లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ నేతలతో కలిసి వైసిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 2026 నూతన సంవత్సరం క్యాలెండర్, వాల్ స్టిక్కర్ మరియు సి ఎల్ బుక్స్ ను ఆవిష్కరించారు.2026 నూతన సంవత్సరం వైయస్సార్ టి ఏ మరింత బలోపేతం ఆయ్యే దిశగా.. నేతలు కృషి చేయాలని చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు. ఉపాధ్యాయులకు అండగా ఉంటూ.. వారి సమస్యలపై అలుపెరుగని పోరాటం సాగించాలని.. వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ నేతలకు చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమం లో వైఎస్ఆర్ టి ఏ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు,మండల నాయకులు మరియు అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *