మన ధ్యాస, నెల్లూరు,డిసెంబర్ 25: నెల్లూరు వెంకటేశ్వరపురం 53వ డివిజన్ హోసన్నా మందిరంలో క్రిస్మస్ పండుగ సందర్బంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి యేసుక్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా చర్చి ఫాదర్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కి ప్రభువు ఆశీర్వచనాలు అందజేశారు. రాబోయే ఏడాదిలో పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తలపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని చర్చి ఫాదర్ దీవెనలు అందజేశారు.ఈ సందర్బంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…….క్రిస్మస్ పండుగ రోజున హోసన్నా ప్రార్థన మందిరానికి కి విచ్చేసి ఏసుక్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు ఎంతో పవిత్రమైనదని ప్రజలందరిలోనూ ప్రేమ, దయా, క్షమ, సేవా గుణాలు అలవారేలా వారు సమాజ హితం కోసం ప్రార్థనలు చేయడం జరుగుతుందన్నారు.క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *