మన ధ్యాస, నెల్లూరు,డిసెంబర్ 25 :భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలు, బౌద్ధ ధర్మ సారాంశం, సామాజిక సమానత్వ భావజాలాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో అంబేడ్కర్ ధర్మ ప్రచార సమితి (ఏడిపిఎస్ ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 30 రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మాస్టర్ రామచంద్ర రావు ఇంగిలాల ప్రకటించారు. నెల్లూరు నగరం దర్గామిట్ట,అంబేద్కర్ భవనంలో గురువారం అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ బౌద్ధ దమ్మ స్వీకార కార్యక్రమం మరియు ఏడిపిఎస్ 30 వసంతాల మహాసభను నిర్వహించినారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ధర్మ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇంగిలాల రామచంద్రరావు మాట్లాడుతూ……అంబేడ్కర్ తత్వాన్ని కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా, ప్రజల జీవితాల్లో అమలయ్యేలా చేయడమే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.ఉద్యమ నేపథ్యం 1995లో డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన తర్వాత, దేశంలో సామాజిక చైతన్యం మరింత బలపడిందని నిర్వాహకులు గుర్తు చేశారు. అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు—ప్రత్యేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు మరియు ప్రసంగాలు ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.ఈకార్యక్రమ వివరాలలు 30 రోజుల ప్రచార యాత్రలో భాగంగా గ్రామాలు, పట్టణాలు, నియోజకవర్గాల్లో సభలువిద్య, సమానత్వం, స్వాభిమానం, న్యాయం వంటి అంశాలపై అవగాహన సమావేశాలుయువత, విద్యార్థులకు ప్రత్యేక సెషన్లుఅంబేడ్కర్ తత్వంపై పుస్తకాలు, పత్రికల పంపిణీ బౌద్ధ ధర్మ సూత్రాలపై చర్చలునిర్వహించనున్నారు. ప్రతి రోజూ కనీసం 3 గంటల పాటు ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ జరిపి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు.రాజకీయాలపై విమర్శాత్మక దృష్టిఈ సందర్భంగా నిర్వాహకులు ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై కూడా విమర్శలు గుప్పించారు.ఓట్ల కొనుగోలలు,అధికార దుర్వినియోగం ప్రజల శోషణ వంటి ధోరణులు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ ఆశించిన ప్రజాస్వామ్యం అంటే—సమానత్వం, నైతికత, మానవ గౌరవం ఆధారంగా ఉండాలని తెలిపారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించిన ఎడ్యుకేట్, ఆర్గనైజ్, ఎజిటేట్ అనే త్రిసూత్రాలను ప్రతి గ్రామంలో అమలు చేయడమే ఏడిపిఎస్ లక్ష్యమని చెప్పారు. విద్య ద్వారానే చైతన్యం, చైతన్యంతోనే సంఘటనం, సంఘటనతోనే మార్పు సాధ్యమని వివరించారు.ప్రజలకు పిలుపుఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ముఖ్యంగా యువత ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. సామాజిక అన్యాయాలపై మౌనం వీడాలని, అంబేడ్కర్ మార్గాన్ని అనుసరించి సమాజ మార్పుకు కృషి చేయాలని కోరారు.అంబేడ్కర్ ధర్మ ప్రచార సమితి చేపడుతున్న ఈ 30 రోజుల ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా సామాజిక చైతన్యానికి దోహదపడుతుందని, అణగారిన వర్గాల్లో స్వాభిమానం, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏడిపిఎస్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు యర్రబోతు సుబ్రహ్మణ్యం, ఏడిపిఎస్ నెల్లూరు నగర కమిటీ అధ్యక్షులు ఉయ్యాల వెంకటరమణయ్య, ఏడిపిఎస్ ఆంధ్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదలవాడ బాల గురవయ్య, గుండ్లపల్లి ఆంజనేయులు,చిట్టేటి రమణయ్య, తూపిలి నాగరాజు, జంగిటి వెంకటయ్య, దార్ల కోటేశ్వరరావు, నిజమాల ప్రసాద్, ఏడిపిఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు గుండవోలు గోపాలయ్య అంబేద్కర్ ధర్మ పోరాటి సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *