మన ధ్యాస, ముత్తుకూరు,డిసెంబర్ 23 :అందరి సహకారంతోనే నెల్లూరు జిల్లా వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుంది అనే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు అదే స్ఫూర్తితో ముందుకు….సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అవసరమైన వసతులు కల్పిస్తాం అని అన్నారు. నెల్లూరు జిల్లాముత్తుకూరులో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ……కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వేపల్లి నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం అని అన్నారు.సీఎస్ఆర్ నిధులతో వెంకటాచలం, పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాం అని తెలియజేశారు.వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఎస్ ఈ ఐ ఎల్ కంపెనీ రూ.60 లక్షల విలువైన పరికరాలు అందించింది. ఆస్సత్రి అభివృద్ధి కమిటీ సభ్యురాలైన శ్రీనితా రెడ్డి తదితరులు కూడా తమ వంతు కృషి చేశారు అని అన్నారు.ఫలితంగా వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రం జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది అని అన్నారు.నేషనల్ హెల్త్ మిషన్ ఇన్సెఫెక్షన్ లో రాష్ట్ర స్థాయిలో రెండు సీ.హెచ్.సీలకు ఎన్ క్యూ ఏ ఎస్ సర్టిఫికేషన్ లభించగా వాటిలో వెంకటాచలం ఆస్పత్రి ఒకటి కావడం సంతోషదాయకం అని అన్నారు.మరో నెలలో ఇంకో కమిటీ కూడా వెంకటాచలం సీ.హెచ్.సీ పరిశీలనకు రానుంది అని తెలియజేశారు.కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలు వైద్య సేవలు పొందే ఆరోగ్య కేంద్రాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం అని అన్నారు.ప్రభుత్వ నిధులతో పాటు సీఎస్ఆర్ నిధులను కూడా ఉపయోగించుకుంటున్నాం అని తెలియజేశారు.ఆరోగ్య కేంద్రాల్లో వసతుల కల్పనకు ఎస్ ఈ ఐ ఎల్ కంపెనీ రూ.2 కోట్లు ఇవ్వడం గొప్ప విషయం అని అన్నారు.వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నారు అని అన్నారు.కోరిన వెంటనే పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి డయాలసిస్ సెంటర్ మంజూరు చేశారు అని అన్నారు.డయాలసిస్ సెంటర్ లో ఐదు బెడ్లు ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఎస్ ఈ ఐ ఎల్ కంపెనీ మరో 3 అందించింది అని అన్నారు.8 బెడ్ల డయాలసిస్ సెంటర్ సేవలను పొదలకూరుతో పాటు మనుబోలు, సైదాపురం, రాపూరు, కలువాయి, చేజర్ల, సంగం మండలాల ప్రజల ఉపయోగించుకుంటున్నారు అని అన్నారు.39 ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి రూ.13.70 కోట్లు మంజూరు అయ్యాయి అని అన్నారు.ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో ఎస్ ఈ ఐ ఎల్ కంపెనీ ఆస్పత్రితో పాటు నర్సింగ్ కళాశాల నిర్మాణానికి ముందుకొచ్చింది అని అన్నారు.సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేందుకు అన్ని విధాల సహకరిస్తున్న మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎస్ ఈ ఐ ఎల్ కంపెనీతో పాటు తోడ్పాటు అందిస్తున్న అందరికీ ధన్యవాదములు తెలియజేశారు.
