గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి.
కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు).
ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల మల్లికార్జున నవంబర్ 27 న మధ్యాహ్నం జరావారిపాలెం చర్చి దగ్గర యాక్సిడెంట్ లో మెదడుకు బలమైన గాయమై నెల్లూరు హాస్పిటల్ కు తరలించాగా అక్కడ చికిత్స పొందుతూ డిసెంబర్ 06,న శనివారం మృతి చెందారు.ఈ విషయమై ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సూచనల మేరకు కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి ,జిర్రా అంకిరెడ్డి, కొప్పోలు కొండలరావు, గ్రామస్తులు నివాళులు అర్పించారు.మృతునికి టిడిపి సభ్యత్వ కార్డు ఉన్నందున ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లి ఇన్సూరెన్స్ వర్తించేలా చూస్తామని బిజ్జం వెంకటకృష్ణారెడ్డి మృతిని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.









