తవణంపల్లి డిసెంబర్ 6 మన ధ్యాస
పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం లోని కామలూరుకు చిత్తూరు టు కామాలూరు నూతన ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసును ప్రారంబించిన ఏపీఎస్ఆర్టీసీపూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఇటీవల కామాలూరు గ్రామస్తులు ఎమ్మెల్యేని కలిసి బస్ సౌకర్యం లేనందున విద్యార్థులు,వృద్ధులు మరియు మహిళల రాకపోకలకు ఇబ్బందిగా వుందని సమస్యను ఎమ్మెల్యే వివరించగా ఎమ్మెల్యే వీలైనంత త్వరగా బస్ సర్వీసును ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.చెప్పిన విధంగా ఈరోజు ఉదయం 11 గంటలకు బస్ సర్వీసును ప్రారంబించిన ఎమ్మెల్యే , ఈ కార్యక్రమంలో తవణంపల్లి,ఐరాల మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి,హరిబాబు నాయుడు, పారిశ్రామికవేత్త రఘురామ చౌదరి, ఏఎంసి చైర్మన్ భాస్కర్ నాయుడు,తవణంపల్లి ఏఎంసిమండల మాజీ అధ్యక్షులు దిలీప్ నాయుడు,క్లస్టర్ ఇంచార్జీ ప్రవీణ్, ప్రధానకార్యదర్శి గాంధీ,డిపో మేనేజర్, గ్రామ సర్పంచ్,జగదీష్,గోపి యాదవ్,స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.







