అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా మనుబోలు మండల పరిధిలో జలమయమైన గ్రామాల్లోకి సోమిరెడ్డి
మన ధ్యాస, మనుబోలు, డిసెంబర్ 6:
సర్వేపల్లి నియోజకవర్గం కొలనకుదురులో నీటమునిగిన వరినాట్లు, నారుమడులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం పరిశీలించడంతో పాటు జలదిగ్భందంలో ఉన్న ఎస్టీ కాలనీ పర్యటించినారు.కట్టువపల్లి, బద్దెవోలు తదితర గ్రామాల్లోనూ ప్రజలను పలకరించి వినతుల స్వీకరించినారు.వేలాది ఎకరాల్లో వరినారు మడులు, నాట్లు దెబ్బతిన్నాయని, రైతులకు ఉచితంగా విత్తనాలు అందించాలని మంత్రి అచ్చెన్నాయుడిని కోరినట్లు వెల్లడించినారు.నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.







