ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రతి ఒక్కరికి అందాలి.నాయకులు, అధికారుల మధ్య సమన్వయం అవసరం.
మన ధ్యాస,కొడవలూరు, డిసెంబర్ 6:ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఎమ్మెల్యేలే ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కొడవలూరు మండల ఎంపిడిఓ కార్యాలయంలో శనివారం ఉదయం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ….. కొడవలూరు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…. స్థానిక నాయకులు, అధికారులతో సమన్వయం చేసుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని కోరారు. ప్రతి నాయకుడు వారంలో ఒక రోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేటాయించాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటిని పరిష్కరించడమే ప్రజా దర్బార్ కార్యక్రమ లక్ష్యమన్నారు. ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కారించడానికే ప్రజల మధ్యకు వచ్చానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాననని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హామీ యిచ్చారు. ఇళ్ళు, ఇళ్ల స్ధలాలు లేని వారు ఈ నెల 14 లోపు సమీప సచివాలయాలలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. స్థానిక నాయకులు మరియు సచివాలయ సిబ్బంది ప్రభుత్వ పధకాల గురించి ప్రజలకు తెలియ చేయాలన్నారు. ప్రజా దర్బార్ లో రోడ్లు, డ్రైన్లు, పాఠశాల భవనాలు, ఇళ్ళు, ఇంటి స్థలాలు కావాలన్న ప్రజల విన్నపాలను త్వరగా పరిష్కరించేలా అధికారులను ఆదేశిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల తహసీల్దార్ స్ఫూర్తి రెడ్డి, ఎంపీడీఓ సుబ్బారావు, టీడీపీ మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కరకట్ట మల్లికార్జున రావు, ఎంపీటీసీ రాజా, మండల నాయకులు వెంకట రమణారెడ్డి, వినీల్, సతీష్ రెడ్డి, మదన్ లతో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







