శ్రీ దత్తాత్రేయ సిద్ధ మంగళ పూర్ణాహుతి హోమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

ఓం శ్రీ దత్తాత్రేయ నమః నాదంతో ప్రతిధ్వనించి మైపాడు సముద్ర తీరం.శ్రీ రామానంద భారతీ స్వామి వారి సారధ్యంలో వైభవంగా శ్రీ దత్త హోమ పూర్ణాహుతి పూజా మహోత్సవం.
మన ధ్యాస,ఇందుకూరుపేట, డిసెంబర్ 6:
నెల్లూరు జిల్లా,కోవూరు నియోజవర్గం ,ఇందుకూరు పేట మండలం మైపాడు సముద్ర తీరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దువ్వూరు కళ్యాణ్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శనివారం పూజ్యశ్రీ రామానంద భారతి స్వాముల వారు విశిష్ట అతిధులుగా విచ్చేసి నిర్వహించిన శ్రీ దత్తాత్రేయ సిద్ధ మంగళ పూర్ణాహుతి హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి శ్రీ దత్తాత్రేయ సిద్ధ మంగళ పూర్ణాహుతి హోమంలో పాల్గొని శ్రీ రామానంద భారతి స్వాముల వారిచే వేదాశ్వీరాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…… శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు తలపెట్టిన 33 కోట్ల సిద్ధ మంగళ పారాయణ దీక్షలో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్టాలకు చెందిన వేలాది మంది భక్తులు 120 రోజుల పాటు సామూహికంగా సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేస్తున్నారన్నారు. మైపాడు వేదికగా పవిత్ర సాగర తీరంలో శ్రీ దత్తాత్రేయ సిద్ధ మంగళ పూర్ణాహుతి హోమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరు పేట టిడిపి అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, చెంచు కిషోర్ యాదవ్, ముంగర గోపాల్, మధు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    మన ద్యాస ప్రతినిధి, సాలూరు : – మండలంలోని మామిడి పల్లి శ్రీ సరస్వతీ శిశు మందిర్లో కమిటీ సభ్యులు, ఆచార్యులు నిర్వహించిన సప్త శక్తి సంగం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వక్తల సందేశాన్ని…

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    మన ధ్యాస ప్రతినిధి , సాలూరు డిసెంబర్ 7:- స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం. స్నేహం కంటే గొప్పబంధం మరేది లేదని 1987 సంవత్సరం పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పదవతరగతి బ్యాచ్ రుజువు చేసింది. ప్రతీ సంవత్సరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి  స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం