జియ్యమ్మ వలస/మనధ్యాస డిసెంబర్ 06.
జియ్యమ్మ వలస మండలంలో చినమేరంగి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సవరపు రవణ ఆధ్వర్యంలో చంద్రశేఖర్ రాజపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారము
ఎన్ఎస్ఎస్ ప్రాధాన్యత గురించి గవర్నమెంట్ జూనియర్ కళాశాల, చినమేరంగి, ప్రిన్సిపాల్ సవరపు రవన ప్రసంగించారు.అనంతరం గ్రామంలో చెత్తలను పోగుచేసి రోడ్లను శుబ్రాపరిచారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సవరపు రావణ మాట్లాడుతు. ముందు ఊరు బాగుంటేనే ఊరిలో ఉన్న ప్రజలు బాగుంటారు. మన ఊరిని మనము ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచుకుంటూనే గ్రామంలో ఉన్న ప్రజలు ఆరోగ్యంగానే ఉంటారని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా పారిశుధ్యం పై అవగాహన కల్పిస్తుందని అలాగే ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో స్వచ్ఛభారత్ కార్మికులు ఉన్నారని వారి ద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండే విధముగా చర్యలు చేపడుతుందని. అలాగే గ్రామాల్లో ఉన్న తడి చెత్త పొడి చెత్త వేరుచేసి స్వచ్ఛభారత్ కార్మికులకు గ్రీన్ నెంబర్స ప్రతి వీధిలోకి వచ్చేటప్పుడు గ్రామస్తులు సహకరించి వారి తెచ్చే తో ట్టి బల్లులో వెయ్యాలని ఆయన గ్రామస్తులకు కోరారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సవరపు రవన ఆధ్వర్యంలో చంద్రశేఖరాజపురం గ్రామం మొత్తం పరిశుభ్రంగా ఉంచడం జరిగిందని. ఇదే స్ఫూర్తితో గ్రామస్తులు ప్రతి ఒక్కరు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలా ఉంటే మనకు ఎటువంటి అనారోగ్యలు రావని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ పి ఓ సంజయ్ కుమార్ చావడా, స్కూల్ టీచర్ శివ , వార్డు మెంబర్ శంకర్, రాధాకృష్ణ, వీకేజీ మహారాణా, పతివాడ శ్రీను, ఫిషరీస్ గౌరీశంకర్, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *