ఏపీ లో పదో తరగతి విద్యార్ధులకు బంపరాఫర్‌..ఇకపై పరీక్ష ఫీజు విద్యార్థులే ఆన్‌లైన్‌లో చెల్లించే సౌకర్యం కల్పించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్, మన ధ్యాస, డిసెంబర్ 06 (కె ఎన్ రాజు).

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు 2025-26 విద్యా సంవత్సరానికి వచ్చ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి జరగనున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే పరీక్షల ఫీజు చెల్లింపులు కూడా ప్రారంభమైనాయి. ఈసారి విద్యార్థులే నేరుగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసులురెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.విద్యార్థులు తామే ఫీజు చెల్లిస్తే ఆ విషయాన్ని ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరిగా తెలియజేయాలని ఈ సందర్భంగా, సూచించారు.పాఠశాలలు అధిక ఫీజు డిమాండు చేస్తే విద్యార్థులు నేరుగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించుకోవచ్చని సూచించారు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పరీక్ష ఫీజు రూ.125 కంటే అదనంగా నగదు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, ఈ క్రమంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.నిబంధనలకు విరుద్ధంగా అధికంగా ఫీజు వసూలుచేసే ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని, సంబంధిత బడులకు జరిమానా విధిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసులురెడ్డి వార్నింగ్ ఇచ్చారు. స్కూల్‌ యాజమన్యం అనధికార వసూళ్లకు పాల్పడితే విద్యార్థులు, తల్లిదండ్రులు మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు ఫిర్యాదులు చేయొచ్చని సూచించారు. కాగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగనున్నాయి

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

    బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

    ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    నవోదయ మోడల్ టెస్ట్‌కు విశేష స్పందన: శ్రీ సత్య కైలాస్ స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ.

    నవోదయ మోడల్ టెస్ట్‌కు విశేష స్పందన: శ్రీ సత్య కైలాస్ స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ.

    జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు తిరుమల సాయి హైస్కూల్‌లో అనూహ్య స్పందన.

    జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు తిరుమల సాయి హైస్కూల్‌లో అనూహ్య స్పందన.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు