నూతన ఇల్లు నిర్మాణం కి మరో అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అంటున్న తెలుగుదేశం పార్టీ రావులకొల్లు సర్పంచ్ పూసల వెంగపనాయుడు.

కలిగిరి,మన ధ్యాస న్యూస్ అక్టోబర్ 04, (నాగరాజు కె).

ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం లో 23 గ్రామ పంచాయతీ లలో నిరుపేదలకు రాష్ట్ర ముక్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదర్వాంలో నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారద్యం లో నూతన ఇల్లు మంజూరుకు నవంబర్ నెలలో 30 తేదీ వరకు అవకాశం కల్పించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరల డిసెంబర్ 05 తేదీ వరకు అవకాశం కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని తెలుగుదేశం పార్టీ రావులకొల్లు సర్పంచ్ పూసల వెంగపనాయుడు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్వం లో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 2 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు.నియోజకవర్గం లోని కలిగిరి మండలం లో 23 గ్రామ పంచాయతీ లలో ఇల్లు లేని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు స్థానిక సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు. లబ్ధిదారులు అధికారులను స్థానిక నాయకులను సంప్రదించి డిసెంబర్ 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కురిచేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారథ్యంలో నూతన ఇల్లు మంజూరు చేసుకున్నందుకు వచ్చినటువంటి అవకాశాన్ని కలిగిరి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *