కలిగిరి,నవంబర్ 30,మనధ్యాసన్యూస్,(కె నాగరాజు)
దిత్వా తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో కలిగిరి, కొండాపురం,వింజమూరు,జలదంకి,మండలాల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని.కలిగిరి సర్కిల్ పరిధి లోని పోలీస్ శాఖ ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కునేందుకు సంసిద్ధంగా ఉందని కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ తెలిపారు.వింజమూరు,కొండాపురం,కలిగిరి,జలదంకి,మండలాల లోని పలు గ్రామాల వద్ద ఉన్న సప్తాలపై నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వాగులు, వంకలు, కాలువలు ఉన్న పరిసర గ్రామ ప్రజలు చేపల వేటకు, సరదాగా ఈత కొట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.నీటి ప్రవాహం ఉన్న వాగుల సప్తాలపై ప్రయాణించేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.తుఫాను దృష్ట్యా అధికారులు సూచనలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.కలిగిరి సర్కిల్ మండలాల పరిధిలో ప్రతి గ్రామంలో చిన్నపిల్లలను, బడి ఈడు పిల్లలను నీటి గుంటల దగ్గరికి వెళ్ళనివ్వకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ప్రతి గ్రామంలో చెరువులు నీటి గుంటలు నిండుగా నీటితో ఉన్నాయి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని కోరారు. దిత్వా తుఫాను దృష్ట్యా భారీ వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్లను వదిలి బయటకు రావద్దని కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ*









