కుభ్యనాయక్ తండా సర్పంచ్ ఏకగ్రీవం… సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం,జుక్కల్ నియోజకవర్గంలోని పెద్దకొడపగల్ మండలంలోని కుభ్యనాయక్ తండాలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం కావడం విశేషం.తండా ప్రజలు బీసీ మహిళ గాయత్రిని ఏకగ్రీవంగా తమ సర్పంచ్‌గా ఎన్నుకుంటూ ఏకమత్యాన్ని ప్రదర్శించారు.ఈ సందర్భంగా పిట్లం మండలంలోని సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సన్మాన సభకు విచ్చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును అక్కడి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ గాయత్రికి అభినందనలు తెలియజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.శుభాకాంక్షలు అందజేశారు.కుభ్యనాయక్ తండా ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎంపిక చేస్తూ ఐక్యతను ప్రదర్శించిన తీరు ప్రశంసనీయమని,ప్రజలు అభివృద్ధిని ఆశిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, పెద్ద కొడప్ గల్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

  • Related Posts

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంతోపాటు,సుల్తాన్ నగర్, అచ్చంపేట్,బ్రహ్మంపల్లి,వెల్గనూర్,మాగి,వడ్డేపల్లి,మల్లూర్, జక్కాపూర్,నర్సింగ్ రావు పల్లి, మంగ్లూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే తోట…

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేసుకుందాం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంతో పాటు ధూప్ సింగ్ తండా,గిర్ని తండా, గాలిపూర్,మాగ్దుంపూర్,కోమలంచ,తుంకిపల్లి,నర్వ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 3 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 3 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    • By RAHEEM
    • December 9, 2025
    • 6 views
    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు