
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం,జుక్కల్ నియోజకవర్గంలోని పెద్దకొడపగల్ మండలంలోని కుభ్యనాయక్ తండాలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం కావడం విశేషం.తండా ప్రజలు బీసీ మహిళ గాయత్రిని ఏకగ్రీవంగా తమ సర్పంచ్‌గా ఎన్నుకుంటూ ఏకమత్యాన్ని ప్రదర్శించారు.ఈ సందర్భంగా పిట్లం మండలంలోని సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సన్మాన సభకు విచ్చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును అక్కడి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ గాయత్రికి అభినందనలు తెలియజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.శుభాకాంక్షలు అందజేశారు.కుభ్యనాయక్ తండా ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎంపిక చేస్తూ ఐక్యతను ప్రదర్శించిన తీరు ప్రశంసనీయమని,ప్రజలు అభివృద్ధిని ఆశిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, పెద్ద కొడప్ గల్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.