
వింజమూరు, నవంబర్ 28,మన ధ్యాస ప్రతినిధి, (కె ఎన్ రాజు)://
వింజమూరు మండలానికి సమీపంలో ఉన్న జీవీకేఆర్ ఎస్టీ కాలనీ వాసుల భూములు ఎన్ యు డి ఎ,( NUDA) ఆధీనంలోకి వెళ్లిపోతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ని పలువురు కాలనీ ప్రజలు కలిసి తమ సమస్యను వివరించారు.భూములు కోల్పోతామన్న భయంతో జీవనాధారం ప్రమాదంలో పడుతుందంటూ బాధలు చెప్పుకున్న ప్రజలతో ఎమ్మెల్యే ప్రత్యక్షంగా మాట్లాడి ఓదార్చారు.జిల్లా జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లుతో కలిసి భూ వివాదం పై పరిశీలనలు చేస్తూ, సంబంధిత రికార్డులను సవివరంగా చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,మీ భూములు ఎక్కడికి పోవు. ప్రతి అర్హుడికి హక్కుగా భూమి చేరేలా నేను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తాను. మీ జీవనాధారాన్ని రక్షించడం మా బాధ్యత. మీ అందరికీ పూర్తి న్యాయం జరిగేలా చూస్తాను,అలాగే సాగు చేసుకునే ప్రతి కుటుంబానికి భూ కేటాయింపులో ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని, రెవెన్యూ రికార్డుల ఆధారంగా సరైన నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆర్డీవో వంశీకృష్ణ, తహసీల్దార్ హమీద్, ఎంపీడీవో శ్రీనివాసులురెడ్డి, పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు పాల్గొన్నారు








