ఉత్తరాఖండ్ వలస కూలీ దుక్కి రామ్ రాయ్ రోడ్డు ప్రమాదంలో మృతి
21మంది వలస కూలీలకు నేను అండగా ఉంటా బాధితులకు ధైర్యం చెప్పిన ఉదయగిరి ఎమ్మెల్యే..!
వలస కూలీల దారి ఖర్చుల కోసం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.10,000 తక్షణ ఆర్థిక సహాయం..!
జలదంకి నవంబర్ 27 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి://

జలదంకి మండలం గట్టుపల్లి–చింతలపాలెం ప్రాంతంలో జరిగిన దారుణ హత్య సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం తిరుగు ప్రయాణంలో 9వ మైలు సమీపంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ నేషనల్ హైవే పై జరిగిన మరో విషాదకర ఘటనను గమనించారు.ఉత్తరాఖండ్ నుంచి వలసవచ్చి జీవనోపాధి కోసం పనిచేస్తున్న 21 మంది కార్మికులలో ఒకరైన దుక్కి రామ్ రాయ్ ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ఈ హృదయ విదారక సంఘటనపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని శ్రద్ధగా పరిశీలించి, ప్రమాదానికి కారణమైన వాహనదారుడిని గుర్తించి పట్టుకునేందుకు తక్షణమే పోలీసు వ్యవస్థకు ఆదేశాలు జారీ చేశారు. నేరస్థుడిని పట్టుకోవడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.అదే సమయంలో, ప్రమాదంతో ఆందోళనలో ఉన్న మిగతా 20 మందికి ధైర్యం చెప్పి, ప్రభుత్వం మరియు తాను పూర్తి స్థాయి అండగా ఉంటానని ఎమ్మెల్యే కాకర్ల హామీ ఇచ్చారు.వారి ప్రయాణం ఆగిపోకుండా,వారు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని తెలిపారు.అతడు మరణించిన దుక్కి రామ్ రాయ్ మృతదేహాన్ని అతని స్వగ్రామానికి పంపేందుకు ప్రభుత్వం మరియు స్థానిక అధికారులతో సమన్వయం చేసి తగిన ఏర్పాట్లు చేస్తానని ఛేదించారు.వలస కూలీల తక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వారి దారి ఖర్చులకు సాయం చేయడానికి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున పదివేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కష్ట సమయంలో వారు ఒంటరిగా లేరని, తమకు అన్ని విధాల సహకారం అందుతుందని వారికి భరోసా ఇచ్చారు








