మన ధ్యాస ప్రతినిధి సాలూరు నవంబర్ 24:-కూటమి నాయకుల బెదిరింపులకు వైఎస్ఆర్సిపి నాయకులు బెదిరేది లేదని ఎన్ని అడ్డంకులు వచ్చిన ప్రభుత్వంపై వ్యతిరేక పోరాటం చేస్తామని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తూ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అబద్ధపు హామీలతో అధికారంలోకి రావడం జరిగిందన్నారు. 18 నెలలు కావస్తున్న నేటికీ ఇంకా వాళ్లు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో రెండింటిని అమలు చేయలేకపోయారన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలే తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని జోష్యం చెప్పారు. అదేవిధంగా ప్రజా ఆరోగ్యంపై నిర్లక్ష ధోరణి వ్యవహరిస్తు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వైద్యంపై నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఇటీవల మలేరియా పచ్చకామర్ల వ్యాధితో అనేకమంది చనిపోవడం జరిగిందన్నారు . గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వైద్యానికి పెద్ద పీఠ వేస్తూ ముందుచూపుతో పట్టణంతో పాటు, గ్రామంలో ఉన్న ప్రతీ ఇంటికి వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. నేడు అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి పదవి కాలంలో ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను పేద విద్యార్థులకు వైద్య, విద్యను అందించే లక్ష్యంతో మంజూరు చేయించడం జరిగిందన్నారు. అందుకు భిన్నంగా ఈ ప్రభుత్వం పిపిపి విధానం ద్వారా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కంకణం కట్టుకున్నారన్నారు. ఇటువంటి విధానాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకొనేంతవరకూ, ఈ ప్రభుత్వంపై వైయస్సార్ పార్టీ నాయకులు పోరాడుతామని హెచ్చరించారు. వంద పడకల ఆసుపత్రిని మా హయాంలో ఉపముఖ్యమంత్రి రాజన్న దొర నిధులు మంజూరు చేయించి సుమారు 80 పర్సంటేజ్ భవనపు పనులు పూర్తి చేశారన్నారు. ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఆసుపత్రి పనులు పూర్తి చేస్తామని గొప్పలు చెప్పుకున్న స్థానిక మంత్రి 18 నెలలు కావస్తున్న నేటికీ ఆసుపత్రిని ప్రారంభించలేకపోయారన్నారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను నట్టేట ముంచారన్నారు. పత్తి కొనుగోలు కేంద్రంలో పెంట్లకు 7, నుండి 8 వేలకు కొనుగోలు చేస్తామని చెప్తున్నా ప్రభుత్వం చంద్రంపేట వద్ద 5 వేలకు పత్తిని కొనుగోలు చేయడమేంటని ప్రశ్నించారు. వైయస్సార్ ప్రభుత్వ హయాంలో కేంద్రంతో కలిపి డబ్బులు ఇస్తే ఎద్దేవా చేసిన నాటి ప్రతిపక్ష నేతలు, నేడు కేంద్రం ఇచ్చిన డబ్బులతో కలిపి 26, వేలు కలిపి ఇవ్వాల్సింది పోయి 20వేలు ఇవ్వడమేంటని అన్నారు. ఇటీవల తుఫాను తాకిడికి దెబ్బతిన్న పంటలకు ఈ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని కావున నష్టపోయిన రైతులందరిని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని పత్రికా ముఖంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వ నాయకులు వాటిని ప్రైవాటీకరణ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. అదేవిధంగా నా హయాంలో మంజూరు చేయించిన వంద పడకల ఆసుపత్రిని వాళ్లే తెచ్చుమని గొప్పలు చెప్పుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు. నా ఇంటికి తెలుగుదేశం నాయకులే రోడ్లు వేయించామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు కదా, ఆ రోడ్లు వేయించిన దానికి నేటికీ బిల్లులు చెల్లించలేదని ఎద్దేవా చేశారు. వాస్తవానికి నా డబ్బులతో మా ఇంటి ముందు రోడ్డు నేనే వేయించుకున్నానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో 3 లక్షల32 వేల కోట్లను అప్పు చేస్తే కూటమీ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే 2లక్షల25 వేల కోట్లను అప్పు చేశారన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా 60శాతం ఎక్కువ కూటమి ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పుకొచ్చారు. ఓట్లు దండుకొని అధికారం చేపట్టడం కోసం ఇప్పుడున్న స్థానిక మంత్రి అబద్ధపు హామీలతో గద్దినెక్కి ఓట్లు వేసిన ప్రజలను మర్చిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గిరి రఘు, గొర్లె జగం, మాజీ కౌన్సిలర్ పిరిడి రామకృష్ణ, కొల్లే రామకృష్ణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కాకి పాండురంగ, వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్ తో పాటు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *