ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక కాలేజీ రోడ్డు వద్ద జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీహరిరాజు సూచనల మేరకు ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు నడిపే పలువురు బండ్లను సరైన పత్రాలు లేని పలు వాహనాలను, నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ప్రతి ఒక్కరూ వాహనాలకు నంబర్ ప్లేట్లు కనిపించే విధంగా పెట్టుకోవాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలు దగ్గర పెట్టుకోవాలని లేని యెడల చట్టపర చర్యలకు బాధ్యులవుతారన్ని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ఎస్సైలు, స్పెషల్ బెటాలియన్, పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *