ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన… ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )భారత మాజీ మహిళా ప్రధాని,భారతరత్న, ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరా గాంధీ చిత్ర పటానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ..
ఇందిరా గాంధీ భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పారని.ఆమె రాజకీయ,వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని శక్తిమంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడారు.ఇందిరాగాంధీ దేశానికి అందించిన నిరుపమాన సేవలు నేటితరం నాయకులకు,యువతకు సైతం స్ఫూర్తిదాయకమని తెలిపారు.బ్యాంకుల జాతీయకరణ,జమీందారీ వ్యవస్థ రద్దు,గరీబీ హఠావో వంటి దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు..
ఇందిరా గాంధీ భారత స్త్రీ శక్తికి ప్రతీక అని, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తినిచ్చే నాయకురాలిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని వెల్లడించారు.
అవకాశాలు వస్తే అద్భుతాలు చేయగలం అంటూ నిరూపించారని.ప్రతి మహిళకు ఆమె చూపిన ధైర్యం, అంకితభావం నేటికీ స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు సాయి పటేల్,తదితరులు ఉన్నారు

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర