మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ ) పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.44 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి సదుపాయాలను పరిశీలించారు.పాఠశాలలో ఏర్పాటు చేసిన AI ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ కొత్త క్లాస్‌రూమ్స్‌ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ..విద్య యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతిభను ప్రదర్శిస్తూ ముందుకు సాగాలని విద్యార్థులను ప్రేరేపించారు. ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేసి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.జుక్కల్ నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు, ల్యాబొరేటరీలు,క్లాస్‌రూమ్స్,మౌలిక వసతులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయిలో నిలబెట్టే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రారంభించడం కీలకమైన నిర్ణయమని తెలిపారు.
ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని పట్టుదలతో చదివి తమ గమ్యాన్ని చేరుకోవాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ప్రవీణ్ కుమార్,తదితరులు ఉన్నారు










