నాగారం, మన ధ్యాస నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తా వద్ద సురేష్ డెంటల్ క్లినిక్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గురువారం ప్రారంభించారు.ప్రజలకు ఆధునిక సదుపాయాలతో నాణ్యమైన దంత చికిత్స అందించాలనే లక్ష్యంతో ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు డాక్టర్ సురేష్ తెలిపారు.తమ హాస్పిటల్ లో అన్ని రకాల డెంటల్ ట్రీట్మెంట్స్ కి చికిత్స అందిస్తామన్నారు.క్రౌన్స్,రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్,బ్రేసెస్,స్కేలింగ్,అలిగ్నెర్స్,ఎక్స్ట్రాక్షన్,గం థెరపీ వంటి పలు రకాల డెంటల్ ట్రీట్మెంట్స్ అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాగారం మాజీ మున్సిపల్ కమిషనర్ కౌకుట్ల చంద్ర రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు నేమురి మహేష్ గౌడ్,ప్రజా ప్రతినిధులు,అధికారులు,కాలనీవాసులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డా.ధీరవత్ సురేష్ (బీడిఎస్), డి. చందర్ (అసిస్టెంట్ ఇంజనీర్, టీఎస్ఆర్టీసీ),డా. జే. ప్రతాప్ కుమార్ (పిహెచ్.డి), వి. హరిలోల్ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్), తారాచంద్ (సెక్షన్ ఇంజనీర్),డా. వాణి, డి. చుక్కబాయి (ఏఎస్ఐ), జె. రాములు,డి. సంతోష్, డి. బాబు నాయక్, డి. హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.








